నాగార్జున ఎప్పుడూ తన సినిమాల్లో కొత్తగానే కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అందుకే తన సినిమాల ఎంపిక ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో నాగార్జున ఇటీవల చేసిన చిత్రం, త్వరలో విడుదలకు రెడీ అయిన చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ సినిమాకు గురించి ప్రవీణ్ సత్తారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అలా ఆయన ఎందుకు అన్నారంటే?
సినిమాకు ‘ది ఘోస్ట్’ అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయం కూడా ప్రవీణ్ సత్తారు చెప్పారు. ‘‘ఘోస్ట్ చాలా శక్తిమంతమైన పేరు, ఊహాతీతమైనది కూడా. ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ పేరుకు ఓ పవర్ ఉంటుంది. ఆ పేరున్న అధికారి ఎవరికీ కనిపించడు, ఎక్కడున్నాడో తెలియదు.. కానీ చేయాలనుకున్నవి చేసేస్తుంటాడు. సినిమాలో నాగార్జున పాత్ర క్యారక్టరైజేషన్ అలానే ఉంటుంది. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టాం అని చెప్పారు.
కొవిడ్ వల్ల ప్రేక్షకులు ప్రపంచ సినిమాలకు అలవాటు పడ్డారు. ఏది మంచి సినిమా, సినిమా అంటే ఎలా ఉండాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నారు ప్రేక్షకులు. ఏ సినిమా ఓటీటీలో చూడొచ్చు, థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన సినిమా ఏది అని లెక్కలేసుకుని చేస్తున్నారు అంటూ ప్రేక్షకుల శైలిలిని విశ్లేషించారు ప్రవీణ్ సత్తారు. సినిమా తీయడం అంటే.. సినిమా అనే పుస్తకంలో ఓ పేజీ రాయడం లాంటిది అని చెప్పారు.
ఇప్పుడు తాము చేసిన ‘ది ఘోస్ట్’ సినిమా కూడా అలాంటి ఒక పేజీనే అని అన్న ప్రవీణ్ సత్తారు.. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ పేజీ ఇలానే ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ప్రతి అక్షరాన్నీ ఆచితూచి రాయాలి అంటే ప్రతి సినిమాను జాగ్రత్తగా తీయాలి అని అన్నారు. అలాంటి భయం.. బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది అని కూడా వివరించారాయన. ‘ది ఘోస్ట్’ అక్టోరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!