NTR, Balakrishna: నందమూరి మల్టీస్టారర్ కు డైరెక్టర్ అతనేనా..?

అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన మనం క్లాసిక్ సినిమాగా నిలవడంతో పాటు అక్కినేని అభిమానులను ఆకట్టుకుంది. నందమూరి హీరోల మల్టీస్టారర్ తెరకెక్కితే బాగుంటుందని బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ లో సినిమా రావాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు నందమూరి హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తూ ప్రవీణ్ సత్తారు బిజీగా ఉన్నారు.

నందమూరి హీరోల మల్టీస్టారర్ కు ప్రవీణ్ సత్తారు ఎన్.బి.కె అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఎన్ అంటే ఎన్టీఆర్, బి అంటే బాలకృష్ణ, కె అంటే కళ్యాణ్ రామ్ అనే అర్థం వచ్చేలా టైటిల్ పెడతారని సమాచారం. అయితే మల్టీస్టారర్ లో నటించడానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెబుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టం లేదనే సంగతి తెలిసిందే.

బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో నటిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని బాలయ్య గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ పట్టాలెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, బాలయ్య వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు నందమూరి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా షూటింగ్ మొదలవ్వాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus