Balakrishna: బాబాయి అబ్బాయిల్ని కలిపి సినిమా సెట్‌ చేస్తున్నారా?

నందమూరి మల్టీస్టారర్‌.. దీని గురించి వెయిట్‌ చెయ్యని వాళ్లు ఎవరున్నారు చెప్పండి. నందమూరి ఫ్యాన్స్‌ కాని వాళ్లు ఈ సినిమా కోసం ఎదురుచూస్తారు. ఎందుకంటే బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సినిమా అంటే ఆ మాత్రం మజా ఉంటుంది మరి. ఈ ముగ్గురిని కలిపి సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నా… అవేవీ వర్కౌట్‌ అవ్వలేదు. ఇప్పుడు మరో దర్శకుడు ఈ పని మీద ఉన్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.

Click Here To Watch NOW

బాలకృష్ణ – కల్యాణ్‌రామ్‌ – ఎన్టీఆర్‌లను కలిపి సినిమా చేయాలి అంటే చాలా సత్తా కావాలి. కలిపి కథ అనుకోవడం, రాయడం, తీయడం, మెప్పించడం ఇలా చేయాలి అంటే చాలా సత్తా కావాలి అనే చెప్పొచ్చు. ఆ సత్తాను తన ఇంటి పేరులో పెట్టుకున్న దర్శకుడే తాజాగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం. అవును ప్రవీణ్‌ సత్తారు నేతృత్వంలో ప్రస్తుతం నందమూరి మల్టీస్టారర్‌ ప్రయత్నాలు సాగుతున్నాయట. NBK పేరుతో ఓ సినిమా కథను ప్రవీణ్‌ సత్తారు సిద్ధం చేసుకున్నారని టాక్.

ఈ కథను ముగ్గురికీ వినిపించి ఓకే చేసుకోవడమే మిగిలి ఉందట. అయితే ఇదే చాలా పెద్ద పని. ఎందుకంటే ముగ్గురు మాస్‌ హీరోలకు కథ ఒప్పించడం అంత ఈజీ కాదు. మొత్తం కాలెక్యులేషన్స్‌ చూసుకొని ఈ సినిమా చేయాలి. అందుకే అంతా ఓకే అనుకున్నాకే కథ వినిపించాలని ప్రవీణ్‌ చూస్తున్నారట. అన్నట్లు NBK అంటే నందమూరి బాలకృష్ణ కాదట. ఎన్టీఆర్‌ – బాలకృష్ణ – కల్యాణ్‌రామ్‌ అట. ఈ సినిమా ఆలోచన ఎంతవరకు కరెక్ట్‌.. ఎంతమేర సాధ్యమవుతుంది అనేది తెలియదు కానీ.

ఆలోచనే అదిరిపోయింది. ‘మనం’తో అక్కినేని హీరోల మల్టీస్టారర్‌ వచ్చేసింది, ‘ఆచార్య’తో మెగా హీరోల మల్టీస్టారర్‌ వచ్చేసింది. ఇక మిగిలిన వాటిలో నందమూరి మల్టీస్టారర్‌ ఒకటే. ‘సత్తా’రు కథ ఓకే అయితే అది కూడా చూసేయొచ్చు. బాల‌ బాబాయ్‌తో సినిమా చేయాల‌ని ఉంది అని చాలా రోజుల నుండి అంటూనే ఉన్నాడు తారక్‌. క‌ల్యాణ్ రామ్ కూడా అంతే. ఇప్పుడు బాల‌య్య నుండి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే ప్రాజెక్టు ఓకే అయిపోతుంది. ఆ తర్వాత మిగతా సంగతులు చూడొచ్చు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus