సినిమా పూర్తి అయిన తర్వాత.. ఆ చిత్రం గురించి గొప్పగా చెప్పడం సహజం. ఆ మాటలు ఇది వరకు చాలా పొలైట్ గా ఉండేవి. ఇప్పుడు ముక్కు సూటిగా ఉంటున్నాయి. కొన్ని సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారేమో అనిపిస్తున్నాయి. కానీ అటువంటి మాటలే ఇప్పుడు సినిమా విజయానికి ఒక కారణం అవుతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో .. సినిమా ప్లాప్ అయితే ఎవరు కూడా మా సినిమా చూడొద్దు అని విజయ్ దేవరకొండ నిర్మొహమాటంగా చెప్పారు. అప్పుడు ఏంటి హీరో ఇలాగా కూడా మాట్లాడుతారా? అని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది విమర్శించారు. కానీ మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసారు. ఆర్ఎక్స్ 100 సినిమా ప్రచారంలో కూడా చిత్ర బృందం అటువంటి కాన్ఫిడెంట్ నే ప్రదర్శించింది.
అది హిట్టైంది. ఇదే ఇప్పటి ట్రెండ్ అని శ్రీనివాస కళ్యాణం చిత్ర బృందం అలాగే మాట్లాడింది. కానీ ఈ సినిమా విషయంలో అది వర్కౌట్ కాలేదు. తాజాగా నర్తనశాల హీరో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. “సినిమా బాగుటుంటే సినిమా చూడండి. బాగాలేకపోతే అసలు థియేటర్స్ వైపుకు వెళ్లొద్దు” అని చెప్పారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. ఈ ధీమాతోనే నాగశౌర్య ఈ కామెంట్స్ చేసుంటాడని అందరూ అనుకుంటున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో వచ్చే గురువారం తెలిసిపోనుంది.