Prince OTT: ఓటీటీకి ‘ప్రిన్స్’ ఎప్పటినుండంటే?

శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ కె వి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘శాంతి టాకీస్’ ల పై నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ పర్వాలేదు అనిపించే టాక్ ను సొంతం చేసుకుంది

కానీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. పోటీగా ‘సర్దార్’ ‘ఓరి దేవుడా’ ‘కాంతార’ వంటి చిత్రాలు ఉండడంతో ఈ మూవీని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ సినిమాకి పోటీలో ఎక్కువ థియేటర్లు కూడా దక్కలేదు కాబట్టి అది కూడా మైనస్ అయ్యింది. ఇక థియేటర్లలో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఈ చిత్రం త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ప్రిన్స్’ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుందట.

తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో అయినా ఈ మూవీ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను తమిళ్, తెలుగు రైట్స్ కలుపుకుని రూ.42 కోట్ల భారీ రేటుకి అమ్మినట్టు తెలుస్తుంది. అలాగే ‘జాతి రత్నాలు’ రిజల్ట్ వల్ల శాటిలైట్ రైట్స్ కూడా ఎక్కువ రేటుకే అమ్ముడైనట్టు తెలుస్తుంది.

ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ హైలెట్ అని చెప్పాలి. వేరే సీజన్లో కనుక ఈ చిత్రం సోలో రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించేది అనే చెప్పాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus