Bheemla Nayak: ‘ఏకే’ రీమేక్‌ వస్తే బాగుండు అని అప్పుడే అనుకున్నారట!

‘భీమ్లా నాయక్‌’లో డేనియల్‌ శేఖర్‌ పాత్రను ఇటీవల చిత్రబృందం పరిచయం చేసింది. ఆ పాత్రలో రానా అదరగొట్టేశాడు, అదరగొట్టేసుంటాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పాత్ర ప్రాధాన్యం లాంటి టాపిక్‌లు పక్కనపెడితే… ఆ పాత్రను మాతృకలో పోషించిన పృథ్వీరాజ్‌ సుకుమార్‌ మాత్రం చాలా ఎగ్జైట్‌ అవుతున్నారు. ఈ సినిమా గురించి తన మసనులోని భావాలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ‘భీమ్లానాయక్‌’లో డేనియల్‌ శేఖర్‌ వీడియోను లాంచ్‌ చేయడంతోపాటు పృథ్వీరాజ్‌ ఓ స్పెషల్‌ మెసేజ్‌ షేర్‌ చేశాడు.

అందలుఓ ‘భీమ్లా నాయ‌క్’ సినిమాను ప్ర‌శంస‌లతో ముంచెత్తాడు. ‘అయ్య‌ప్ప‌నుమ్‌ కోషీయుమ్‌’ సినిమా, అందులో తాను చేసిన కోషీ కురియన్‌ పాత్ర త‌న‌కు చాలా ప్రత్యేకం అని చెప్పాడు పృథ్వీరాజ్‌. నిజానికి ఈ సినిమాను వేరే భాష‌ల్లో రీమేక్ చేస్తే చాలా బాగుంటుంద‌ని ‘ఏకే’ షూటింగ్‌ టైమ్‌లోనే అనుకున్నారట.తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా, త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జాల క‌ల‌యిక‌లో ఇంత పెద్ద స్థాయిలో సినిమా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు.

త‌మ‌న్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్‌ ఇస్తారని అస్సలు ఊహించలేదని పృథ్వీరాజ్‌ పేర్కొన్నాడు. తన ఫ్రెండ్‌ రానా… తన పాత్ర‌ను చేయ‌డం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్‌. త‌న కంటే ఆ పాత్రను రానా బాగా చేస్తున్నాడ‌నిపిస్తోంద‌ని పృథ్వీ పొగిడేశాడు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus