Priyamani: ‘భామాకలాపం’ నాకు ఏమేం నేర్పిందంటే..?

యూట్యూబ్‌ – అందులో వంటల ఛానల్‌. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. తెలిసిన వంటను పది మందికి తెలియజేయడం వాటి కర్తవ్యం. అలా స్టార్‌ యూట్యూబర్లు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అనుపమ. వంటల యూట్యూబర్‌. కానీ ఆమెకు మరో అలవాటు కూడా ఉంది. అదే పక్కింట్లో ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ. అలాంటి కథతో రూపొందుతున్న సినిమా ‘భామా కలాపం’. అందులో యూట్యూబర్‌గా ప్రియమణి నటిస్తోంది. ‘ఆహా’లో ఈ సినిమా త్వరలో స్ట్రీమ్‌ అవుతోంది.

Click Here To Watch

కోల్‌కతా మ్యూజియంలో దొంగతనానికి గురైన ₹200 కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరిగే కథతో ‘భామా కలాపం’ రూపొందించారు. అసలు ఆ గుడ్డేంటి, దానికి అంత ధరేంటి, ఎందుకు పోయింది, అనుపమ దగ్గరకు ఎలా చేరింది, వచ్చాక ఏమైంది అనేది ఈ సినిమా. ఈ సినిమాలో ‘అనుపమ ఘుమఘుమ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ నిర్వహిస్తుంటుంది ప్రియమణి. అందులో భాగంగా రుచికరమైన వంటల తయారీ విధాలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తుంటుంది. అలా కుటుంబ నిర్వహణ చూసుకోవడమే కాదు.. పక్కింట్లో ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకుంటూ ఉంటుంది.

అయితే అందులో దురుద్దేశం ఏమీ ఉండదు. అలాంటి సమయంలో ₹200 కోట్ల గుడ్డు ఎక్కడ, ఎలా వచ్చింది అనేదే కథ. అనుపమ లాంటి మహిళలను నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలదు. ఎవరి నుండి చూసి స్ఫూర్తి పొందకుండా స్పాట్‌లో అనుకునే చేశా. డైరెక్టర్‌ ఫస్ట్‌ టైమ్‌ చెప్పినప్పుడే భలే నచ్చేసిది అనుపమ. గతంలో ఈ తరహా పాత్రను ‘రగడ’లో చేశా. అయితే అందులో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది కానీ… సంఘటనకు సంబంధించినంత వరకే. ఓ అనుకోని ఘటన నుండి బయటపడేందుకు అనుపమ చేసే ప్రయత్నాలు ఫన్నీగా ఉంటాయి.

సినిమా కెమెరామెన్‌ దీపక్‌, డైరక్టర్‌ అభిమన్యుతో అంత ఈజీ కాదు. ఏ సీన్‌ని సింగిల్‌ టేక్‌తో సరిపెట్టుకునేవారు కాదు. వన్‌ మోర్‌ టేక్‌ అంటుండేవారు. నటిగా నేర్చుకునేందుకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. నిజ జీవితంలో నాకు అనుపమకి ఎలాంటి పోలికలు లేవు. అనుపమ వంటల్లో ఎక్స్‌పర్ట్‌, నాకసలు వంటలే రావు. ఆమెలా నేను అమాయకురాలినీ కాదు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ వీడియోస్‌ చేసి ‘మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా, ప్రారంభిస్తారా?’ అని అడుగుతున్నారు. నాకైతే అలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే.. నాకంత ఓపికా లేదు అని చెప్పింది ప్రియమణి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus