మీమ్స్ చూసి నవ్వుకుంటున్న స్టార్ హీరోయిన్!

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ పక్క హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క బాలీవుడ్ సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. రీసెంట్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా ట్రోలింగ్ కి గురైంది. ఫ్యాషన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రియాంక.. అప్పుడప్పుడు వింత డ్రెస్సుల్లో కనిపించి ట్రోలింగ్ బారిన పడుతుంటుంది. తాజాగా ప్రియాంకకు అలంటి అనుభవమే ఎదురైంది.

ఓ ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా ధరించిన గ్రీన్ కలర్ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బంతిలా గుండ్రటి ఆకారంలో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను ధరించిన ప్రియాంక.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాసేపటికే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. మీమర్స్ వెంటనే తమ క్రియేటివిటీని వాడి పలు మీమ్స్ ని పోస్ట్ చేశారు. దీపావళికి కాల్చే ఫైర్ క్రాకర్స్, హాట్ ఎయిర్ బెలూన్ లతో ఆమె డ్రెస్ ను పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు.

క్రికెటర్ విరాట్ కొహ్లీని కూడా ఈ మీమ్స్ లోకి లాగారు. ప్రియాంక డ్రెస్ బంతిలా ఉండడంతో.. విరాట్ కొహ్లీ క్యాచ్ పడుతున్నట్లుగా మీమ్స్ ని సృష్టించారు. ఈ మీమ్స్ వైరల్ అవుతుండగా.. ప్రియాంక వీటిపై పాజిటివ్ గా స్పందించింది. తనే స్వయంగా సోషల్ మీడియాలో మీమ్స్ ని పోస్ట్ చేసి.. ఇవి చాలా ఫన్నీ ఉన్నాయని.. మీమ్స్ చేసిన వారికి థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది.


Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus