Priyanka chopra: ఆ సమయంలో హింసాత్మకంగా మారిపోతా: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఒక్కసారిగా బాలీవుడ్ టూ హాలీవుడ్ అనే ఈ స్థాయికి ఎదిగారు. ఈ విధంగా బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ స్టార్ నటిగా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలది. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో విజయపథంలో దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమె వయసులో తనకన్నా చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు నెటిజన్ నుంచి ఒక వింత ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రాను ప్రశ్నిస్తూ మీ భర్త కనుక మిమ్మల్ని వదిలేస్తే మీరేం చేస్తారు అంటూ షాకింగ్ క్వశ్చన్ అడిగారు. ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఒక అబ్బాయి వేరే అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్న తర్వాత తనతో జీవితం కొనసాగించాలా వద్దా అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని వెల్లడించారు. ఇక తన విషయంలో అలాంటి వ్యక్తి తనకు దొరికితే పిచ్చి పిచ్చిగా కొట్టేస్తానని సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. ఆ సమయంలో నేను హింసాత్మకంగా మారుతాను అంటూ సమాధానం చెబుతూ అందరినీ భయపెట్టేసారు. ఇలా తన విషయంలో మోసం జరిగితే సహించనని ఈమె పరోక్షంగా వెల్లడించారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus