Priyanka Chopra: సరోగసీ కామెంట్స్ పై ప్రియాంక రియాక్షన్!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, సంపన్న కుటుంబానికి చెందిన వారు బిడ్డల్ని కనే విషయంలో సరోగసీ పద్దతిని ఎన్నుకుంటున్నారు. తమ అందం దెబ్బ తింటుందని, డెలివెరీ సమయంలో బాధను భరించలేమనే ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్తున్నారనే ఆరోపణలు సెలబ్రిటీల మీద బలంగా వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం.. ఇదే కారణంతో సరోగసీకి వెళ్లిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కామెంట్లు తనను ఎంతగానో బాధించినట్లు ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

తాము సరోగసీకి వెళ్ళడానికి కారణాలు వేరని చెప్పింది. తన అందం దెబ్బ తింటుందనే సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి చాలా బాధ పడ్డానని.. కానీ నిజం వేరని చెప్పింది. కావాలని సరోగసీకి వెళ్లలేదని.. తనకు వైద్యపరమైన సమస్యలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీను ఎన్నుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తన బిడ్డను గర్భంలో మోయడానికి అంగీకరించిన మహిళ ఎంతో దయగలిగిందని.. కొన్ని నెలల పాటు వెతికిన తరువాత ఆమె దొరికిందని..

దాదాపు ఆరు నెలల పాటు బిడ్డను ఆమె జాగ్రత్తగా కాపాడిందని చెప్పుకొచ్చింది. తన కూతురు పుట్టాల్సిన డేట్ కంటే మూడు నెలల ముందే జన్మించిందని.. ఆ సమయంలో పాప బరువు చాలా తక్కువ అని.. ఆమెని చూసినప్పుడు చాలా బాధ పడ్డానని తెలిపింది. తమ బిడ్డను కడుపులో మోసిన మహిళ పేరు కలిసొచ్చేలా పాపకు మాల్దీ అని పేరు పెట్టామని చెప్పింది.

తన కూతురికి సంబంధించి ఎలాంటి గాసిప్స్ చదవడం తనకు ఇష్టం లేదని.. అందుకే మీడియాకి దూరంగా, చాలా జాగ్రత్తగా పెంచుతున్నామని ప్రియాంక చెప్పుకొచ్చింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus