షూటింగ్‌లో గాయపడ్డ స్టార్‌ హీరోయిన్‌.. ఫొటో చూస్తేనే భయంగా..!

ప్రముఖ కథానాయిక, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గాయపడింది. కొత్త సినిమా ‘ది బ్లఫ్’ షూటింగ్‌లో భాగంగా ఆమెకు మెడ దగ్గర గాయమైంది. దీని గురించి ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘ది బ్లఫ్‌’ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది అని చెప్పింది. ‘వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ ప్రమాదం, గాయానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ప్రమాదానికి గురైన ప్రియాంకను షూటింగ్ సిబ్బంది సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు ఆమె వెంటనే చికిత్స అందించారు. ఫొటోల బట్టి చూస్తే ప్రియాంక ముఖం, పెదవి, మెడ భాగాల్లో గాయాలైనట్టు అర్థమవుతోంది. మెడ వద్ద నిటారుగా చీరుకున్నట్లుగా గాయం కనిపిస్తోంది. అయితే ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఏమీ లేదని చెబుతున్నారు. కానీ గాయం పెద్దదిగానే ఉంది. సినిమాకు యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రియాంక విశ్రాంతి తీసుకుంటోంది అని సన్నిహితులు చెబుతున్నారు. ‘అవెంజర్స్’ సినిమా నిర్మాతలు రూసో బ్రదర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఫ్రాంక్ ఇ. ఫ్లవర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే మరో యాక్షన్‌ – కామెడీ సినిమాలోనూ ప్రియాంక నటిస్తోంది. నిజానికి ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ సినిమా అయిపోయిన తర్వాత చిత్రీకరణలకు కొంత విరామం తీసుకోవాలని ప్రియాంక అనుకుందట. అయితే, అప్పటికే ‘ది బ్లఫ్‌’ టీమ్‌ రిక్వైర్‌మెంట్‌ మేరకు కాల్షీట్స్‌ కేటాయించిందట. అందుకే వద్దనుకున్నా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టింది ప్రియాంక. ఇప్పుడు ఈ సెట్స్‌లో గాయపడటం గమనార్హం.

ఇక ఎనిమిదేళ్ల క్రితం ‘జై గంగాజల్‌’ సినిమా తర్వాత ప్రియాంక మళ్లీ మన దేశంలో సినిమాలు చేయలేదు. ఒకట్రెండు సినిమాలు నిర్మాతగా మాత్రమే చేసింది. అయితే ఇటీవల ఆమె మళ్లీ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తుంది అని వార్తలొచ్చినా.. ఇంకా ఏవీ అధికారికంగా ఓకే చేయలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus