Priyanka Jain: ప్రియాంక జైన్ అలాంటి ఏరియాలో నివశించారా.. ఆమె కన్నీటి కష్టాలివే!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ప్రియంక జైన్ ఒకరు. స్టార్ మా ఛానెల్ లో సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన ప్రియాంక జైన్ బిగ్ బాస్7 లో టాప్5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నారు. అయితే ప్రియాంక ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. ఒకప్పుడు ముంబైలో నివశించిన ప్రియాంకకు సంబంధించిన మై ముంబై హోమ్ టూర్ అంటూ చాలా నెలల క్రితం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తాను ముంబైలో నివశించిన ఇంటిని చూపిస్తూ ప్రియాంక జైన్ ఎమోషనల్ అయ్యారు. నా చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య చనిపోయారని ఆమె పేర్కొన్నారు. మా అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రియాంక జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేవుడు మంచి జీవితం ఇచ్చాడని ఆమె కామెంట్లు చేశారు. మీరు ఈ ఏరియాను స్లమ్ అనవచ్చని ఇదే నా సొంతిల్లు అని ప్రియాంక జైన్ అన్నారు.

మా నాన్నమ్మ సాయంత్రం సమయంలో గుడికి వెళ్లి భజనలు చేసేవారని ఆమె పేర్కొన్నారు. నేను నాలుగేళ్ల పాటు ఇక్కడ ఉన్నానని ప్రియాంక జైన్ పేర్కొన్నారు. హౌస్ చిన్నదైనా ఎమోషన్స్ పెద్దవని ప్రియాంక జైన్ కామెంట్లు చేశారు. ప్రియాంక జైన్ తన కుల దైవం ఫోటోను సైతం చూపించారు. మేము ఈ దేవతను నవ దుర్గా దేవత అని చెబుతామని ప్రియాంక జైన్ కామెంట్లు చేశారు.

నాన్నమ్మ కూడా అకస్మాత్తుగా వదిలి వెళ్లిపోయారని ఆమె తెలిపారు. ఈ చిన్న గదిలో 9 మంది ఉండేవారమని చెబుతూ ఆమె కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు. ప్రియాంక జైన్ ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమె హోమ్ టూర్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. పేరెంట్స్ కష్టం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు. ప్రియాంక జైన్ (Priyanka Jain) చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus