Priyanka Mohan: OG సినిమాలో పవన్ తో జతకట్టిన ప్రియాంక మోహన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఈయన పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా తాజాగా సుజీత్ దర్శకత్వంలో నటించబోతున్న ఓజీ సినిమా షూటింగ్ పనులలో జాయిన్ అయ్యారు. ఈ సినిమా ముంబైలో తాజాగా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించబోతున్నారని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఎట్టకేలకు ఈ వార్తలపై మేకర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన (Priyanka Mohan) ప్రియాంక మోహన్ నటిస్తున్నారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ప్రత్యేక పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈమె కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని డివివి దానయ్య తన నిర్మాణ సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇలా పవన్ సరసన మొదటిసారి ప్రియాంక మోహన్ సందడి చేయబోతున్నారు. ఇదివరకే ప్రియాంక మోహన్ నాని గ్యాంగ్ లీడర్,శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించిన సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజగా పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమాషూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదయ సీతం రీమేక్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో కూడా ఈయన జాయిన్ అయ్యారు.ఇక ఈయన కమిట్ అయిన సినిమాలు అన్నింటిని కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేసి తిరిగి రాజకీయాలలో బిజీ కానున్నారని తెలుస్తోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus