స్టార్ హీరోతో ప్రియాంక మోహన్ రొమాన్స్!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమాలో అమ్మడి క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రియాంకకి సరైన అవకాశాలు రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం.

సూర్య హీరోగా దర్శకుడు పాండిరాజ్ ఓ సినిమాను రూపొందించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘డాక్టర్’ అనే సినిమాతో ప్రియాంక కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ కాక ముందే ఏకంగా స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు పాండిరాజ్ ఎప్పటిలానే తనకు కలిసొచ్చే రూరల్ యాక్షన్ డ్రామా జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గతంలో సూర్య, పాండిరాజ్ కలిసి ‘పసంగ 2’ సినిమా చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డి ఇమాన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus