Bigg Boss 5 Telugu: నువ్వా నేనా అంటూ రెచ్చిపోయిన ప్రియాంక, ఉమాదేవి!

బిగ్ బాస్ హౌస్ లో నువ్వా నేనా అన్నట్లుగా హౌస్ మేట్స్ రెచ్చిపోతున్నారు. అది టాస్క్ అయినా సరే ఆర్య్గూమెంట్ అయినా సరే రెచ్చిపోయి మరీ ఫైటింగ్స్ కి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఈవారం లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది ఎవరు..? అలాగే వరెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది ఎవరు అనేది ఏకాభిప్రాయంతో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ల ఓపీనియన్స్ ని చెప్పారు. ఇక్కడే ప్రియంకకి ఇంకా ఉమాదేవికి గట్టిగా పడింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరూ మాటలు విసురుకున్నారు.

ప్రియాంక బెస్ట్ పెర్ఫామర్ గా లోబోకి ఓటు వేసింది. అలాగే వరెస్ట్ పెర్ఫామర్ గా ఉమాదేవి పేరు చెప్తూ రీజన్స్ చెప్పింది. అందరినీ చిన్నచూపు చూస్తున్నారు అని, తీసిపారేసినట్లుగా మాట్లాడుతున్నారని మాట్లాడేసరికి ఉమాదేవి తీసుకోలేకపోయింది. కౌంటర్ ఎటాక్ కి దిగింది. ప్రియాంక కాస్త మితిమీరి మాట్లాడేసరికి ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు.

నన్ను చాలా పద్దతిగా పెంచారని ప్రియాంక అనేసరికి, మేము కూడా పద్దతిగా పెరిగాం అని ఉమా కౌంటర్ వేసింది. దీనికి ప్రియాంక హా.. తెలుస్తూనే ఉంది అనేసరికి ఉమాకి పట్టరాని కోపం వచ్చింది. దీంతో ప్రియాంకపై ఎదురుదాడికి దిగింది. ఇక్కడే ప్రియాంక ఆవేశాన్ని ఆపుకోలేక.. షటప్.. షటప్ అంటూ రెచ్చిపోయింది.

కాసేపటికే మళ్లీ తేరుకుని ఉమాదేవి దగ్గరకి వచ్చి మోకాళ్లమీద కూర్చుని సారీ చెప్పింది. ఇద్దరూ కాసేపు కూల్ అయ్యారు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి బెస్ట్ పెర్ఫామర్ గా విశ్వని, అలాగే వరెస్ట్ పెర్ఫామర్ గా జెస్సీని ఎంచుకున్నారు. జెస్సీ ని కెప్టెన్ సిరి జైల్ లో ఉంచి తాళం వేసింది. అదీ మేటర్.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus