Bigg Boss 7 Telugu: ప్రియాంక అసలు ఎందుకీ సాహసం చేసిందో తెలుసా ? తెర వెనుక ఏం జరుగుతోందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో స్టార్ మా బ్యాచ్ డామినేషన్ ఎక్కువైపోతుంది. దీనికి తగ్గట్లుగానే బిగ్ బాస్ వాళ్లకి పేవర్ చెస్తూ వస్తున్నట్లుగా ఆడియన్స్ గమనిస్తున్నారు. ఇందులో బాగంగా మూడో కంటెండర్ గా ప్రియాంకని ఎంచుకోవాలని ఫిక్స్ అయిపోయాడు బిగ్బాస్. అందుకే, సంబంధం లేని హైయిర్ కటింగ్ టాస్క్ ని వీళ్లిద్దరి మద్యలో పెట్టాడు. ఇందులో అమర్ దీప్ తన హైయిర్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంతేకాదు, తన ఫేవరెట్ హీరో రవితేజ తన హైయిర్ ని ఇష్టపడ్డాడని అచ్చం నాలాగే ఉందని అన్నాడని చెప్పాడు.

దీంతో అమర్ కి బదులు ప్రియాంక తన హైయిర్ ని కట్ చేయించుకుని కంటెండర్ షిప్ అర్హతని సాధించింది. అయితే, కేవలం కంటెండర్ కోసమే ఇంత సాహసం ఎందుకు చేసిందనేది ఆడియన్స్ కి అర్ధం కావడం లేదు. పోని, ఒకవారం ఇమ్యూనిటీ వస్తే పర్లేదు కానీ మరీ పోటీదారులు అవ్వడం కోసం ఇంత సాహసం చేయక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ప్రియాంక ఎందుకు ఈ నిర్ణయం తీస్కుందని విశ్లేషణ చేస్తే తెరవెనుక చాలా విషయాలు జరుగుతున్నాయనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.

బిగ్ బాస్ టీమ్ స్టార్ మా పార్టిసిపెంట్స్ కి ఫేవర్ గా ఉన్నారని, అందుకే ప్రియాంకని ఎలాగైనా సరే ముందుకు తీస్కుని వెళ్లాలని చూస్తున్నారని అంటున్నారు. అందుకే, ఈ టాస్క్ పెట్టారని, తర్వాత వచ్చే టాస్క్ కూడా ప్రియాంకకి, శోభాశెట్టికి ఫేవర్ గానే ఉండబోతున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రిన్స్ తన డాయాస్ ని బ్రేక్ చేసి మరీ ఆటలో నుంచీ క్విట్ అయ్యాడు. దీన్ని బట్టీ చూస్తే ప్రియాంక టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ సంపాదించే ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి హైయిర్ కటింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. బేబీ కట్ లో ప్రియాంక కూడా చాలా క్యూట్ గా ఉండేసరికి ఇప్పుడు ఈ ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి. నిజానికి ఫస్ట్ లో అమర్ ఈ హైయిర్ కటింగ్ ఛాలెంజ్ ని స్వీకరించాడు. కానీ, తర్వాత అస్సలు సస్సేమిరా చేసుకోను అని చెప్పాడు. అలాగే ప్రియాంక కూడా గివ్ అప్ ఇచ్చేద్దామనే అనుకున్నాది.

కానీ తర్వాత మనసు మార్చుకుని బేబీ కట్ చేసుకోవడానికి ఒప్పుకుంది. సంచాలక్ సందీప్, థామిని హెల్ప్ తో ప్రియాంక హైయిర్ ని కట్ చేశారు. ప్రతి సీజన్ లో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఎవరో ఒకరికి ఈ హైయిర్ కట్టింగ్ టాస్క్ ఇస్తునే ఉంటాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus