యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో ఆంధ్రావాలా సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులలో చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వయస్సుకు మించిన పాత్ర చేయడం, సెకండాఫ్ లో కథనం విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లు సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. 2004 సంవత్సరం జనవరి 1వ తేదీన రిలీజైన ఈ సినిమా అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా నిర్మాతలలో ఆవుల గిరి ఒకరు కాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవుల గిరి ఆంధ్రావాలా సినిమా గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
రాజమౌళి డైరెక్షన్ లో చిరంజీవి ఎన్టీఆర్ కాంబోలో సినిమా ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదని ఆవుల గిరి తెలిపారు. నాకు ప్రెస్ అంటే రెస్పెక్ట్ అని కానీ కొందరు మాత్రం చీప్ గా ప్రవర్తించేవారని అవుల గిరి వెల్లడించారు. ఆంధ్రావాలా ఫంక్షన్ కు 15 లక్షల మంది రావడంతో ప్రెస్ కు ఇబ్బంది ఎదురైందని ఆయన అన్నారు. ఆంధ్రావాలా ఫ్లాప్ కావడానికి ఆ టైమ్ కారణమని సింహాద్రి తర్వాత తారక్ నటించడం, భారీస్థాయిలో ఈవెంట్ చేయడంతో ఆంధ్రావాలాపై ఆకాశాన్ని తాకే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని ఆ అంచనాలు అందుకోలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయిందని ఆవుల గిరి వెల్లడించారు.
ఆంధ్రావాలాకు భారీస్థాయిలో ఫంక్షన్ చేయడం నాకు, తారక్ కు ఇష్టం లేదని ఆయన అన్నారు. ఆర్థికంగా ఆంధ్రావాలా సినిమాతో తనకు బాగానే మిగిలిందని గిరి వెల్లడించారు. ఆంధ్రావాలాకు మిగిలిన డబ్బులను డిస్ట్రిబ్యూటర్లకు తాను రిటర్న్ ఇచ్చానని డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రిటర్న్ ఇచ్చిన తర్వాత కూడా తనకు డబ్బులు మిగిలాయని ఆయన వెల్లడించారు. నా అల్లుడు సినిమాకు కూడా తానే నిర్మాతగా వ్యవహరించానని ఆ సినిమాకు నష్టం వచ్చినా ఆ నష్టం చాలా తక్కువ మొత్తం అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్లే ఆంధ్రావాలా సినిమా ఫ్లాపైనా నిర్మాతకు లాభాలు వచ్చాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.