Ashwini Dutt: ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా గురించి అశ్వినీదత్ కామెంట్స్ వైరల్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎలాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో.. అదే రేంజ్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘శక్తి’ (Sakthi) సినిమా గురించి. ‘కంత్రి’ తో (Kantri) ఓ కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ – మెహర్ రమేష్ (Meher Ramesh) – అశ్వినీదత్ (C. Aswani Dutt) ..లు తర్వాత శక్తి కోసం జతకట్టారు.13 ఏళ్ళ క్రితం రూ.55 కోట్ల బడ్జెట్ తో ‘శక్తి’ రూపొందింది. ఆ టైంకి టాలీవుడ్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం అయితే రూ.550 కోట్ల బడ్జెట్ తో సమానం అని చెప్పాలి.

2011 ఏప్రిల్ 1 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా ఫలితాన్ని ఎన్టీఆర్ ఇప్పటికీ మర్చిపోలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) హిందీ ప్రమోషన్స్ లో కూడా ‘ ‘శక్తి’ సినిమా గురించి మాట్లాడకు, మర్చిపో దాన్ని’ అంటూ ఎన్టీఆర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు మెహర్ రమేష్ అయితే తాను ముందుగా అనుకున్న కథ అది కాదని, తర్వాత అశ్వినీదత్ తన టీంతో శక్తి పీఠాల ఎలిమెంట్ ని జోడించారని, అది సరిగా పండలేదని చెప్పుకొచ్చాడు.

కానీ అశ్వినీదత్ మాత్రం.. ఎవ్వరినీ నిందించలేదు. ‘ఆ టైంలో నా జాతకం బాలేదు. ఆ విషయం నాకు తెలిసినప్పటికీ.. ఏదో చేసేద్దాం అని ‘శక్తి’ చేశాను. ఆ సినిమా వల్ల చాలా నష్టపోయాను. నా ల్యాండ్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ‘శక్తి’ దెబ్బకి సినిమాలు మానేయాలని అనుకున్నాను. కానీ నాగ్ అశ్విన్ (Nag Ashwin)  నా జీవితంలోకి వచ్చాక.. ఓ హోప్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు’ అశ్వినీదత్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus