Ashwini Dutt: సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి అశ్వనీదత్ అలా చెప్పారా?

సీనియర్ ఎన్టీఆర్ అటు సినిమాలలో, రాజకీయాలలో సంచలనాలు సృష్టించి ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు. పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆ పార్టీని ఎన్టీఆర్ అధికారంలోకి తెచ్చారు. అయితే అశ్వనీదత్ ఒక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలలో శివుడి పాత్రలలో నటించారు. సాధారణంగా శివుడి పాత్రలో నటిస్తే మెడలో పాము ఉంటుంది.

అప్పట్లో సినిమాలలో ఎక్కువగా రబ్బర్ పాములను ఉపయోగించేవారు. రియల్ పాములను షూటింగ్ ల కోసం వాడితే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆ విధంగా చేసేవారు. అయితే ఎన్టీఆర్ నటించిన ఒక మూవీ కోసం రియల్ పామును వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తి పాము మెడలో ఉండేలా ట్రైనింగ్ ఇస్తుండగా ఆ సమయంలో ఎన్టీఆర్ పాము మెడలో అలానే ఉంటుందని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

రామారావు చెప్పిన విధంగా పాము సీన్ లో నటించడం గమనార్హం. పాము అలా చెయ్యడం చూసి ఆ సీన్ షూటింగ్ లో పాల్గొన్న వాళ్లు అంతా షాక్ అయ్యారని సమాచారం. అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి మాత్రమే కాదు.. అంతకు మించి అని అశ్వినీదత్ (Ashwini Dutt) ఒక సందర్భంలో ఈ ఘటన గురించి చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా చేస్తున్న పలు కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు ఇప్పటికీ బ్రేక్ కాలేదు. ఈతరం ప్రేక్షకులు సైతం సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఎంతగానో ఇష్టపడుతున్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాలను అందుకున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus