2009 సంవత్సరంలో మగధీర (Magadheera) సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు అటూఇటుగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) మగధీర తరహా భారీ సినిమాను నిర్మించి సక్సెస్ సాధించాలని భావించి అప్పట్లోనే 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో శక్తి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సక్సెస్ సాధించకపోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ ఖాతాలో ఫ్లాప్ గా నిలిచింది.
భారీ విజువల్ వండర్ ను తెరకెక్కించి సక్సెస్ సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది. అయితే అశ్వినీదత్ శక్తి (Sakthi) విషయంలో కన్న కల కల్కి (Kalki 2898 AD) విషయంలో నిజమైంది. యునానిమస్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అల్లుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) వైజయంతీ మూవీస్ బ్యానర్ దశనే మార్చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఫుల్ రన్ లో సాధించే కలెక్షన్లను ఓవర్సీస్ లో కల్కి 2898 ఏడీ ఒక్కరోజులోనే సాధించింది. కల్కి 2898 ఏడీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్కి 2898 ఏడీ సినిమా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చింది. హైదరాబాద్ లో కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కల్కి 2898 ఏడీ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం. కల్కి 2898 ఏడీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.