అల్లు అర్జున్ (Allu Arjun) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సినిమా కొన్ని నెలల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమా మొదలయ్యే సూచనలు కనిపించలేదు. పోనీ కథ ఏదో సిద్ధం చేస్తుననారు.. టైమ్ పట్టొచ్చు అనుకున్నారంతా. ఇంతలో అట్లీ సినిమాను ఓకే చేసి, పనులు ప్రారంభించేశాడు బన్నీ. దీంతో త్రివిక్రమ్ సినిమాకు ఇంకా చాలా టైమ్ పట్టే పరిస్థితి ఉందని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి అల్లు అర్జున్ సన్నిహితుడు బన్ని వాస్ చెబుతున్న మాటలు వింటే సమ్‌థింగ్ ఫిషీ అనిపిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్ని వాస్‌ను అల్లు అర్జున్ సినిమాల గురించి అడిగితే.. అట్లీ (Atlee Kumar) సినిమా గురించి ఏదైనా చెప్పాలి అంటే సన్ పిక్చర్స్ వాళ్లే చెబుతారని, తాను ఏమీ చెప్పలేనని క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు ఆ సినిమా టీమ్‌కు, తనకు మధ్య ఓ ఒప్పందం జరిగింది అని కూడా చెప్పారు. మరి త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పండి అంటే ఇంకో విచిత్రమైన వాదనను తీసుకొచ్చారు.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మధ్య మంచి అవగాహన ఉందని.. ఇద్దరూ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా స్టార్ట్ చేస్తామని తేల్చేశారు బన్ని వాస్ (Bunny Vasu). అంటే, ఇప్పట్లో ఈ సినిమా ప్రారంభమయ్యే ఆలోచనలు అయితే కనిపించడం లేదు. మరోవైపు రామ్‌చరణ్ (Ram Charan) – త్రివిక్రమ్ సినిమా ఒకటి చర్చల దశలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా గురించి ఏమన్నా తెలుసా అంటే బన్ని వాస్ (Bunny Vasu) .. తన దగ్గర ఏ సమాచారమూ లేదు అని చెప్పారు.
అయితే ఓ నాలుగు నెలల్లో గీతా ఆర్ట్స్ నుండి ఓ అదిరిపోయే కాంబినేషన్ ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. అయితే అదేంటి అనే చిన్న లీక్ కూడా ఇంకా రాలేదు. దీంతో ఆ సినిమా ఏమవ్వొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి. అవకాశాలు బట్టి చూసుకుంటే గీతా ఆర్ట్స్ అంత ప్రతిష్ఠాత్మకం అంటోంది అంటే కచ్చితంగా అగ్ర ఈరో – అగ్ర దర్శకుడి సినిమానే అవుతుంది. ఆ లెక్కన చిరంజీవితో (Chiranjeevi) కానీ, బాలకృష్ణతో (Nandamuri Balakrishna) కానీ సినిమా అవ్వొచ్చు అని అంటున్నారు. మరి క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.