నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే కుప్పంలోని కేసి ఆసుపత్రికి తరలించారు. కానీ తారకరత్న కండిషన్ క్రిటికల్ గా మారడంతో అక్కడి వైద్య బృందం ఇతన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.ఎంతో అనుభవం కలిగిన నారాయణ హృదయాలయ వైద్య బృందం అతనికి మెరుగైన చికిత్స అందిస్తోంది. అయినా తారకరత్న ఇంకా కోలుకోలేదు. కానీ బాలకృష్ణ,మనోజ్ వంటి వారు తారకరత్న కోలుకుంటున్నాడు అంటూ చెప్పడంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
కానీ నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో తారకరత్న కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తారకరత్నకు గుండెపోటు రావడం.. పరిస్థితి ఇంత క్రిటికల్ గా మారడం వెనుక అతనికి ఉన్న ఓ వ్యసనం కారణమని నిర్మాత చిట్టిబాబు పేర్కొన్నారు. నందమూరి ఫ్యామిలీకి చిట్టిబాబు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న .. చిట్టిబాబుని పెదనాన్న అని పిలుస్తూ ఉంటారు.
చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘తారకరత్న సిగరెట్లు ఎక్కువగా కాలుస్తూ ఉంటాడు. అందరికంటే కూడా ఈ అలవాటు అతనికి ఎక్కువగానే ఉంది. రక్తనాళాల్లో అతనికి బ్లాక్స్ ఏర్పడటానికి ఇదే కారణం. పైగా మెలీనా అనే వ్యాధి కూడా ఉందని గుర్తించడంతో ఇతనికి స్టెంట్ వేయలేకపోతున్నారు వైద్యులు. అయితే నారాయణ హృదయాలయ హాస్పిటల్లోని వైద్యులు ఎంతో అనుభవం కలిగిన వారు. ‘ఇక అయిపోయారు’ అనుకున్న వాళ్ళను కూడా బ్రతికించిన చరిత్ర ఉంది వాళ్లకు.
నిన్న నైట్ అయితే తారకరత్న స్పృహలోకి వచ్చినట్టు బాలకృష్ణ చెప్పాడు. కాబట్టి అతను త్వరగా కోలుకుని తిరిగిరావాలని అంతా కోరుకుంటున్నాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తారకరత్న సిగరెట్లు ఎక్కువ కాల్చడం వెనుక కూడా ఎంతో మనో వేదన ఉందని కూడా ఈ సందర్భంగా చిట్టిబాబు చెప్పుకొచ్చారు. కెరీర్ అనుకున్నట్టు సాగలేదు. హీరోగా నిలబడలేకపోయాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ప్రైవేట్ గా వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇతను సిగరెట్లు ఎక్కువ కాల్చడం మొదలుపెట్టాడు అంటూ చిట్టిబాబు తెలిపారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?