ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుని పాత్ర ముఖ్య కారణమనే సంగతి తెలిసిందే. రావణుడి లుక్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. నిర్మాత వివేక్ కూచిబొట్ల ఆదిపురుష్ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లపై స్పందించి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. పిల్లలకు అర్థం కావాలనే ఆలోచనతో ఆదిపురుష్ ను ఈ విధంగా తీయడం జరిగిందని ఆయన అన్నారు. రావణాసురుడిని ఎవరూ చూడలేదని ఆయన తలల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఊహించుకుంటారని వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు.
ఈతరం పిల్లలకు రాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు తెలుసా అని నిర్మాత కామెంట్లు చేశారు. ఈ సినిమా ద్వారా అయినా పిల్లలకు ఆదిపురుష్ మూవీ అర్థం కావాలని ఈ విధంగా తెరకెక్కించడం జరిగిందని వివేక్ కూచిబొట్ల పేర్కొన్నారు. అప్ డేటెడ్ గా ఆలోచించి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆదిపురుష్ సినిమా వీక్ డేస్ లో కూడా బెటర్ గానే కలెక్షన్లను సాధిస్తోందని తెలుస్తోంది.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో హ్యాపీగానే ఉన్నారని సమాచారం. హైదరాబాద్ లో ఆదిపురుష్ మూవీ మంగళవారం బుకింగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయని సమాచారం. ఆదిపురుష్ సినిమా మల్టీప్లెక్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఫుల్ రన్ లో ఆదిపురుష్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 72 గంటల్లో ఆదిపురుష్ రీ డబ్ వెర్షన్ రిలీజ్ కానుందని సమాచారం.
ఆదిపురుష్ (Adipurush) రీ డబ్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మేకర్స్ చేసిన మార్పులు ఈ సినిమాకు ప్లస్ అవుతాయేమో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.