మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ (Bhimaa) ‘భీమా’ నిన్న అంటే మార్చి 8 న శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. శివరాత్రి హాలిడే కలిసిరావడం, మాస్ సెంటర్స్ లో గోపీచంద్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉండటం..’భీమా’ కి కొంత వరకు కలిసొచ్చింది అని చెప్పాలి. అయితే వీకెండ్ వరకు ఇలాగే కలెక్ట్ చేస్తుందా లేక డౌన్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
అది పక్కన పెట్టేస్తే.. గోపీచంద్ తన నెక్స్ట్ సినిమాని (Srinu Vaitla) శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల ఫామ్లో లేకపోయినప్పటికీ, గోపీచంద్ కూడా రేసులో వెనుకపడినప్పటికీ.. ఈ ప్రాజెక్టు సెట్ అవ్వడం అనేది అందరికీ షాకిచ్చే విషయం. దాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ ప్రాజెక్టుని ‘చిత్రాలయం స్టూడియోస్’ బ్యానర్ పై వేణు దోనేపూడి నిర్మించాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు మొన్నామధ్య ప్రచారం జరిగింది.
ఎందుకంటే ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుండటం, ఆయన వద్ద ఫైనాన్షియర్లు లేకపోవడంతో.. కొన్ని ప్రొడక్షన్ హౌస్లను సంప్రదించగా, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు ముందుకొచ్చి.. హ్యాండోవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించింది లేదు. ఆల్రెడీ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారి నిర్మాణంలో గోపీచంద్ ‘రామబాణం’ (Ramabanam) చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది.