Gnanavel Raja, Siva Karthikeyan: అతడి వలన కోట్లు నష్టపోయా.. హీరోపై నిర్మాత పిటిషన్!

కోలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు శివ కార్తికేయన్. ఈ హీరో రీసెంట్ గా ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 2019లో జ్ఞానవేల్ రాజా నిర్మాతగా శివ కార్తికేయన్ చేసిన సినిమా ‘నేను లోకల్’. ఈ సినిమా కోసం రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పి రూ.11 కోట్లు ఇచ్చారని.. ఇప్పటివరకు మిగిలిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు శివ కార్తికేయన్. తన రెమ్యునరేషన్ ఇవ్వనంత వరకు జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన హక్కులను ఇతరులకు ఇచ్చే విషయంలో చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు శివ కార్తికేయన్.

Click Here To Watch NOW

అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యారు. హీరో శివకార్తికేయన్ కి వ్యతిరేకంగా ఆయన పిటిషన్ వేశారు. శివకార్తికేయన్ కారణంగా తాను రూ.20 కోట్లు నష్టపోయానని పేర్కొన్నారు. నిజానికి తనకు ‘మిస్టర్ లోకల్’ కథ నచ్చలేదని.. కానీ రాజేష్ ని డైరెక్టర్ గా చేయడం కోసం శివకార్తికేయన్ పట్టుబట్టి తనతో పెట్టుబడి పెట్టించి సినిమా చేశారని చెప్పారు జ్ఞానవేల్ రాజా. సినిమా విడుదలై ఇన్ని రోజులు అయిన తరువాత ఇప్పుడు శివకార్తికేయన్ తనపై కేసు ఎందుకు పెట్టారంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

హీరో శివకార్తికేయన్ కారణంగా.. తాను నష్టపోయినందుకు హీరోకే అపరాధం విధించి కేసు కొట్టేయాలని పిటిషన్ లో జ్ఞానవేల్ రాజా తెలిపారు. శివకార్తికేయన్ ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా, రైటర్ గా, సింగర్ గా బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా ‘బీస్ట్’ సినిమాలో అరబిక్ కుతు సాంగ్ రాశారు శివకార్తికేయన్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus