ఆస్కార్‌ వేదికపై తనకు జరిగిన విషయం చెప్పి బాధపడిన నిర్మాత!

దేశానికి ఒక్క ఆస్కార్‌ వస్తే చాలు అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది మనకు రెండు పురస్కారాలు వచ్చాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాటలకు బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌ అవార్డు రాగా, డాక్యుమెంటరీ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ పురస్కారం దక్కించుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తికి గోన్సాల్వెన్స్‌, నిర్మించిన గునీత్‌ మోంగా పురస్కారం అందుకున్నారు. అయితే ఆస్కార్‌ స్టేజీపై తనకు జరిగిన ఇబ్బంది గురించి గునీత్‌ మోంగా స్పందించారు. స్వదేశానికి వచ్చిన ఆమె ఈ మేరకు మాట్లాడారు.

ఆస్కార అకాడెమీ చేసిన ఓ చర్య వల్ల గునీత్‌ మోంగా బాగా ఇబ్బందిపడ్డారట. ఆస్కార్‌ అందుకున్న తర్వాత గ్రహీత 45 సెకన్లు మాట్లాడేందుకు ఛాన్స్‌ ఇస్తారు. ఎవరైనా అంతకుమించి ఎక్కువ సమయం మాట్లాడుతుంటే.. ఆ స్పీచ్‌ను కట్‌ చేసి మ్యూజిక్‌ ప్లే చేసేస్తారు. అయితే గునీత్‌ మోంగా మాట్లాడటం ప్రారంభించకముందే సంగీతం ప్లే చేసేశారు. దీంతో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే స్టేజీ దిగిపోవాల్సి వచ్చింది అని గునీత్‌ మోంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్కార్‌ వేదికపై నేను మాట్లాడబోతుంటే మ్యూజిక్‌ వచ్చేసింది.. దీంతో నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోయాను. అలా గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుండి లాక్కున్నట్లు అనిపించింది అని గునీత్‌ మోంగా బాధపడ్డారు. అయితే ఆమె తర్వాత బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ పురస్కారాలను అందుకున్న వారు 45 సెకన్ల కన్నా ఎక్కువసేపే మాట్లాడారట. నా తర్వాత వేరే వారికి చాలా సమయం ఇవ్వడం కరెక్ట్‌ అనిపించలేదు అని గునీత్‌ మోంగా అన్నారు.

ఆస్కార్‌ ఈ నిబంధన వల్ల కొంతమంది ఇబ్బంది పడటం గతంలోనూ చూశాం. అయితే అంతమంది మాట్లాడేటప్పుడు ఇబ్బంది రాకుండా.. అలాంటి నిబంధన పెట్టారు అంటారు. ఇప్పుడు గునీత్‌ మోంగా కూడా ఇలాంటి సమస్య వల్లనే ఇబ్బంది పడ్డారు. అయితే 45 సెకన్లు సమయం ముగియకుండానే మ్యూజిక్‌ స్టార్ట్‌ చేసేయడం ఏంటో తెలియడం లేదు. అందుకే ఆమె అలా స్పందించారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus