Tholi Prema: పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా వల్ల రెండు పెళ్లిళ్లు జరిగాయి : నిర్మాత జి.వి.జి రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ రిలీజ్ అయ్యి జూలై 24 కి.. 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ జూన్ 30 న ‘తొలిప్రేమ’ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాల సందడి ఎక్కువవుతుంది. అలాగే వాటి కోసం ప్రత్యేకంగా ఈవెంట్ లు చేయడం వంటి పద్ధతి కూడా మొదలైంది.

ఈ క్రమంలో ‘తొలిప్రేమ’ సినిమాకి కూడా ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా ఓ ఈవెంట్ ను చేశారు మేకర్స్. దాదాపు 300 థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని, సెకండ్ రిలీజ్ లో వచ్చే కలెక్షన్స్ ను జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వబోతున్నట్లు.. ‘తొలిప్రేమ’ ని రీ రిలీజ్ రిలీజ్ చేస్తున్న ‘శ్రీ మాతా క్రియేషన్స్’ సంస్థ అధినేతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి తెలిపారు.

ఇక ఈ ఈవెంట్ (Tholi Prema) ‘తొలిప్రేమ’ నిర్మాత జి.వి.జి రాజు మాట్లాడుతూ.. ” మా ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్ టైంలో రెండు ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాలో యాక్సిడెంట్ సన్నివేశం ఉంటుంది. కొడైకెనాల్ ఆ సీన్ ను షూట్ చేస్తున్న సమయంలో మేల్ డూప్, ఫిమేల్ డూప్ గాయపడ్డారు. దీంతో వాళ్ళని హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. వాళ్లిద్దరూ హాస్పిటల్ లో ఉన్న టైంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు.

అలాగే వాసుకి, ఆనంద్ సాయి కూడా ప్రేమలో పడ్డారు. వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇలా మా ‘తొలిప్రేమ’ సినిమా ఎన్నో నిజ ప్రేమ కథలకి కూడా కారణమైంది. అలా ఈ సినిమా మిగిల్చిన అద్భుతమైన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus