SSMB28: మహేష్ – త్రివిక్రమ్ మూవీ బిజినెస్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి థియేటర్లలో సంచలనాలు సృష్టించినవి కావు. ఈ విషయం మహేష్ – త్రివిక్రమ్ ఇద్దరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిస్తే జనాలు ఎంజాయ్ చేసే సినిమా, గుర్తుండిపోయే సినిమా రూపొందుతుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అందుకే ..

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమాకి నాన్ థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది అంటూ కథనాలు వినిపించాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ కి రూ.75 కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.125 కోట్లు .. మొత్తం కలుపుకుని రూ.200 కోట్లు బిజినెస్ చేసినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల పై నిర్మాత నాగ వంశీ స్పందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఎటువంటి బిజినెస్ జరిగలేదు.

ఈ మధ్యనే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఇంకా నాన్ థియేట్రికల్ కు సంబంధించి ఎవ్వరూ సంప్రదించలేదు. మేము కూడా వెంటనే ఎటువంటి ఓటీటీ సంస్థని సంప్రదించలేదు. ముందుగా మేము సంప్రదిస్తే వాళ్ళు ఏదో ఒక ఫేవర్ అడుగుతారు. అందుకోసమే మేము ఇంకా ఎవ్వరినీ సంప్రదించలేదు. ముందుగా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం పై అవగాహన వచ్చాక అప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఆలోచిస్తాం ‘ అంటూ చెప్పుకొచ్చాడు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus