Nagavamsi: లైకుల కోసం తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దు!

గుంటూరు కారం సినిమా గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అలాగే నటించిన ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాట విషయంలో కూడా అదే స్థాయిలో పాట రచయిత రామజోగయ్య పై కూడా ట్రోల్స్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. నేటిజన్స్ దెబ్బకు ఈయన ట్విట్టర్ ఖాతా కూడా క్లోజ్ చేశారు.

ఇక ఈ సినిమా పాటలు విషయంలో మహేష్ బాబు కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటూ నేటిజన్స్ భారీగా టోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ చేసినటువంటి వ్యాఖ్యలపై నిర్మాత నాగవంశీ సీరియస్ అయ్యారు. గుంటూరు కారం సినిమాలోని పాటల పట్ల మహేష్ బాబు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని ఈ విషయంలో మహేష్ బాబు దర్శక నిర్మాతలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా క్లాస్ తీసుకున్నారు అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.

ఇలా ఈ సినిమాలో పాటల గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు రావడంతో నిర్మాత నాగ వంశీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాలోని పాటల విషయంలో మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారు అనడం పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి ఇప్పటికి మూడు పాటలు షూటింగ్ పూర్తి అయ్యాయి. మరొక పాట షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21వ తేదీ షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు.

ఈ పాటల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేవలం మీ లైక్ కోసం సినిమాల గురించి సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు అంటూ ఈయన తన స్టైల్ లో ఘాటుగా స్పందించారు. ఇలా తన సినిమాల పట్ల ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్లు వచ్చిన వెంటనే నాగ వంశి (Nagavamsi) స్పందించి క్లారిటీ ఇస్తారు అనే సంగతి తెలిసిందే.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus