ఎన్టీఆర్ (Jr NTR) ,దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) అనే టైటిల్ తో మరో సినిమా వచ్చింది. అయినా తమ ‘డ్రాగన్’ కి అది ఇబ్బంది కాదు అంటూ నిర్మాత ‘మైత్రి’ రవిశంకర్ (Ravi Shankar) తెలిపారు.
ఈరోజు జరిగిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ రూ.100 కోట్ల సక్సెస్ వేడుకల్లో భాగంగా ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముందుగా ఓ రిపోర్టర్.. ” మీరు ‘పుష్ప 2’ తో దాదాపు రూ.1800 కోట్లు కొల్లగొట్టారు. మరి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కూడా ఆ స్థాయిలో చేస్తుందా?” అంటూ ప్రశ్నించాడు.
మైత్రి రవి శంకర్ (Ravi Shankar) ఆ ప్రశ్నకు జవాబిస్తూ.. “ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందే సినిమా యూనిక్ స్క్రిప్ట్ తో రూపొందుతుంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనిది. దానికి లిమిట్ అంటే..’స్కై ఈజ్ ది లిమిట్’ అని చెప్పాలి. ఆ సినిమా విషయంలో పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాము. అది ఎంత చేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు.
మీరు ఊహించిన దానికంటే.. ఇంకా ఎక్కువే చేస్తుంది. అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మైత్రి రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపే అవకాశం పుష్కలంగా ఉంది.
ఎన్టీఆర్ డ్రాగన్ టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన రవిశంకర్!#Dragon #JrNTR #PrashanthNeel #NTRNeel pic.twitter.com/qHRig1Wnrj
— Filmy Focus (@FilmyFocus) March 3, 2025
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పటివరకు ఇండియన్ ఇండస్ట్రీలో చూడని కథ!
ఆ సినిమా కలెక్షన్స్ కి ఎలాంటి హద్దులు ఉండవు..#Dragon #JrNTR #PrashanthNeel #NTRNeel #ReturnOfTheDragon pic.twitter.com/ZwbQj2z3vu
— Filmy Focus (@FilmyFocus) March 3, 2025