నిర్మాతని పెళ్లాడిన సీరియల్ నటి..ఇద్దరికీ రెండో పెళ్లే.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..!

ఈ ఏడాది పెళ్లి వార్తలు అనేవి చాలా తక్కువగానే వినిపించాయి. కొంతమంది బాలీవుడ్ లవ్ బర్డ్స్, కోలీవుడ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కారు. ఏళ్ల తరబడి డేటింగ్ లు చేస్తూ వచ్చిన వాళ్ళు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.అయితే కొంతమంది విడాకులు కూడా తీసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ తమిళ జంట వివాహం చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రముఖ నిర్మాత అలాగే సీరియల్ నటి వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు. వీళ్లకు ఇది మొదటి పెళ్లి కాదు.. ఈ జంటకు ఇది వరకే పెళ్లైంది. మనస్పర్థలు రావడంతో వీరి భాగస్వామ్యులతో విడిపోయారు. కొన్నాళ్లుగా వీళ్ళు సింగిల్ గానే ఉంటూ వచ్చారు. అలాగే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని భావించిన తరుణంలో ఈరోజు పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వీళ్ళు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. కోలీవుడ్ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్.. సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ ఈరోజు చెన్నైలో పెళ్లి చేసుకున్నారు.

కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది.ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిర్మాత రవిందర్ రూపొందిస్తున్న రెండు సినిమాల్లోనూ మహాలక్ష్మీ నటిస్తోందని సమాచారం. గతంలో ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్‌ లో కూడా నటించినట్టు తెలుస్తుంది. ‘వాణి రాణి’ వంటి క్రేజీ సీరియల్స్ లో మహాలక్ష్మికి మంచి పాత్రలు దక్కాయి. అందువల్ల ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరైంది.

1

2

3

4

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus