కథలనే నమ్ముకుని సినిమాలు తీసే నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) 37 ఏళ్ల క్రితం ఈ బ్యానర్‌ను స్థాపించారు. 1988లో ఏర్పాటైన ఈ బ్యానర్ 2001 వరకు అడపాదడపా సినిమాలు నిర్మిస్తూ వచ్చింది. ఫలితాల సంగతి పక్కన పెట్టి చిక్కని కథ ఉంటే.. చక్కని సినిమా సాధ్యం అనే పాయింట్‌తో ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ వచ్చింది. అయితే కొన్ని సినిమాల ఫలితాలు మిస్ కొట్టడంతో సినిమా నిర్మాణంలో రెండడుగులు వెనక్కి వేసింది. ఇప్పుడు మళ్లీ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ‘యశోద’ (Yashoda), ‘జెంటిల్‌మెన్’ (Gentleman).. ఇప్పుడు ‘సారంగపాణి’ (Sarangapani Jathakam) సినిమాలు అంటే ఆ బ్యానర్ ఏంటో గుర్తుకొస్తుంది. 2001లో ‘భలేవాడివి బాసు’ సినిమాతో ఆపేసిన నిర్మాణ ప్రయాణాన్ని 2009లో మరోసారి ‘మిత్రుడు’ (Mitrudu) సినిమాతో స్టార్ట్ మళ్లీ ఆపేశారు. ఆ రెండు సినిమా ఫలితాలు అంతటి ఇబ్బంది పెట్టాయి మరి. అయితే 2016లో నాని (Nani) ‘జెంటిల్‌మెన్’ తర్వాత సినిమాలు తిరిగి చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు చేతిలో వరుస సినిమాలు ఉన్నాయని చెబుతున్నారు.
‘సారంగపాణి’ సినిమా విడుదల సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆయన బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘ఆదిత్య 369’ సినిమా గురించి, తన తర్వాతి సినిమాల గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఆదిత్య 369’ (Aditya 369) రీరిలీజ్‌తో మరోమారు గౌరవం దక్కిందని చెప్పిన శివలెంక కృష్ణ ప్రసాద్.. ఆ సినిమాకు కొనసాగింపుగా స్క్రిప్ట్ సిద్ధం చేశానని బాలకృష్ణ చెప్పారని గుర్తు చేశారు. తనకు సీక్వెల్ సినిమాలంటే భయమని, అందుకే వాటికి దూరంగా ఉంటానని తెలిపారు.
అయితే బాలకృష్ణ ఆ సినిమా సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమా మొదలుపెడితే అందులో ఏదో రకంగా భాగం అవుతా అని క్లారిటీ ఇచ్చారు. అలాగే ‘యశోద’ సినిమా దర్శకులతో హరి (Harish Shankar), హరీశ్‌తో (Harish Narayan) తమ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుందని తెలిపారు. పవన్ సాధినేని దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని, ఇవి కాకుండా మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) దర్శకత్వంలోనే మరో సినిమా ఉంటుందని పేర్కొన్నారు.