ఉంటుందో లేదో అంటూ డౌట్‌గా ఉన్న సినిమాను ఏకంగా సెమీ మేకింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు AAA టీమ్. త్రివిక్రమ్ (Trivikram) సినిమా మొదలెట్టేస్తా, అక్టోబరు కోసం వెయిట్ చేస్తున్నాం అని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెప్పడంతో ఆ డౌట్ మొదలైంది. అయితే మేమే ముందు మొదలుపెడతాం వస్తాం అట్లీ (Atlee Kumar) – అల్లు అర్జున్ (Allu Arjun) అనౌన్స్‌మెంట్ వీడియోలో చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. సినిమాలో అల్లు అర్జుపన్ కనిపించే లుక్ టెస్టు ఇటీవల విజయవంతంగా పూర్తయిందని సమాచారం.
స్టైలిష్ స్టార్ (ఇప్పుడు ఐకాన్ స్టార్ లెండి) అంటూ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సంపాదించుకున్న అల్లు అర్జున్… ప్రతి సినిమాకీ కొత్త లుక్‌తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ‘పుష్ప’ (Pushpa) సినిమాల కారణంగా గత ఐదారేళ్లుగా గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతోనే కనిపించాడు. ఇప్పుడు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారనున్నాడు. ‘పుష్ప’ లుక్‌కి పూర్తి డిఫరెంట్‌గా ఈ కొత్త లుక్ ఉండనుంది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ మేరకు లుక్ టెస్ట్ కూడా అయిపోయిందట.
ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో ఇటీవల అల్లు అర్జున్‌కు లుక్ టెస్ట్ చేశారట. ఫొటో షూట్, కాన్సెప్ట్ ఫొటోషూట్ లాంటివి చేసి ఫైనల్‌గా ఓ లుక్‌ను ఓకే చేశారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ రకరకాల గెటప్పుల్లో కనిపిస్తాడని, దాదాపు అన్ని లుక్‌లకు సంబంధించి ప్రాథమిక ఆలోచనలు ఓకే చేసుకున్నారు అని సమాచారం. రగ్‌డ్, స్లీక్, ఫ్యూచరిస్టిక్, ఔటర్ స్పేస్ ఇలా చాలానే లుక్‌లు ట్రై చేశారట.
ఈ కాన్సెప్ట్ లుక్ టెస్ట్‌ను బాగా అనలైజ్ చేసి రెండు లుక్స్‌ను ఓకే చేస్తారు అని అంటున్నారు. పునర్జన్మ, ప్రస్తుత కాలం అంశాలను ముడిపెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తారు అని చెబుతున్నారు. నేటి కాలంలో బన్నీ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని టాక్. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందనున్న ఈ సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మొదలవుతుంది అని సమాచారం.