2018 లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంతో ‘నాన్ బాహుబలి’ రికార్డులనన్నింటినీ బ్రేక్ చేశాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. అంతే కాదు కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమని విమర్శించిన వారికి తన నటనతో విశ్వరూపం చూపించాడు. ‘రంగస్థలం’ చిత్రం తరవాత ఇప్పుడు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘వినయ విధేయ రామ’ చిత్రంతో సంక్రాంతికి మరోసారి బాక్సాఫీస్ ను పలకరించడానికి రెడీ అయ్యాడు.
‘రంగస్థలం’ తరువాత వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ చరణ్ ‘నాయక్’ ‘ఎవడు’ చిత్రాలు కూడా సంక్రాంతికే విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. సో చరణ్ సంక్రాంతి హీరో కావడంతో ప్రీ రిలీజ్ కూడా భారీగా జరుగుతుందట.ఈ చిత్ర నైజాం హక్కులు 24 కోట్లకు జరిగినట్టు టాక్. ఇక మన సౌత్ సినిమాలకు నార్త్ లో భారీ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులోనూ యాక్షన్ ఎక్కువగా ఉండే చిత్రాలకు అక్కడ డిమాండ్ బాగా ఎక్కువ. బోయపాటి గత చిత్రం ‘సరైనోడు’ చిత్రం హిందీ డబ్బింగ్ కు యూటుబ్లో 100 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘వినయ విధేయ రామా’ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 22 కోట్లకు కుదిరాయంట. మరి ముందు.. ముందు.. ‘వినయ విధేయ రామా’ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.