నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో అనే పాట సోషల్ మీడియాని ఎలా షేక్ చేసిందో మనకు తెలిసిందే. ఇక ఈ పాట పాడినటువంటి సింగర్ రమణ కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఇక ఇదే పాటను రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో కూడా పెట్టడంతో మరో సంచలనగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఏ వేడుక చూసినా కూడా పల్సర్ బైక్ పాట ఉండాల్సిందే.
ఇక ఈ పాట పాడినటువంటి సింగర్ రమణ (Ramana) కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు అదే విధంగా రైటర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రమణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన నిశ్చితార్థానికి సంబంధించి వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈయన డిసెంబర్ చివరిలోనే ఈ నిశ్చితార్థం జరుపుకున్నారని
అయితే ఆలస్యంగా ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారని తెలుస్తుంది ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కుందన పేరుకు అనుగుణంగానే అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. ఇక వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుపుకున్నారని తెలుస్తుంది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా పూర్తి అయింది అనే విషయం తెలియడంతో వచ్చే నెలలోనే వీరి వివాహం కూడా జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.