Puneeth Rajkumar: పునీత్ పై అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్.. ఏం చేశారంటే?

కొంతమంది స్టార్ హీరోలు భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో జీవించే ఉంటారు. అలాంటి స్టార్ హీరోలలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. పునీత్ మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ఆయన చేసిన మంచి పనులకు సంబంధించి వెలుగులోకి వచ్చిన వార్తలు సాధారణ ప్రజలను ఒకింత షాక్ కు గురి చేశాయనే సంగతి తెలిసిందే. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా వాటి గురించి ప్రపంచానికి తెలియకుండా పునీత్ జాగ్రత్తలు తీసుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోలతో పునీత్ రాజ్ కుమార్ సన్నిహితంగా మెలిగారు. పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానంతో ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలను స్టార్ హీరోలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులలో పునీత్ రాజ్ కుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. పునీత్ ను అభిమానించే ఫ్యాన్స్ కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తాను చేసిన పని ద్వారా పునీత్ పై అభిమానాన్ని చాటుకున్నారు.

దేవుళ్ల మాలలా పునీత్ ఫ్యాన్స్ పునీత్ మాలను ప్రారంభించారు. మార్చి నెల 1 నుంచి 17వ తేదీ వరకు కొంతమంది పునీత్ అభిమానులు పూల మాలలు ధరించి ప్రత్యేక పూజలు చేసి వ్రతం ఆచరించడంతో పాటు పునీత్ పుట్టినరోజు అయిన మార్చి 18వ తేదీన పునీత్ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన కర పత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమానులందు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు వేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక హీరో కోసం ఈ విధంగా చేయడం పునీత్ విషయంలోనే జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పునీత్ ఫోటో పెట్టుకుని కుంకుమ చొక్కా, పంచె, శాలువా ధరించి అభిమానులు అభిమానాన్ని చాటుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus