కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. ఈయన ప్రముఖ నటుడు రాజ్ కుమార్ తనయుడుగా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అనంతరం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణాంతరం ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాదికా వస్తున్న ఇప్పటికీ ఈయన మరణ వార్త నుంచి అభిమానులు బయటపడలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేశారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఈయనకు కర్ణాటక రత్న అవార్డును ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. నవంబరు ఒకటవ తేదీ బెంగళూరులో విధానసౌధ (శాసనసభ) ఎదుట జరిగే కార్యక్రమంలోఅవార్డు ప్రధానం చేయనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొనబోతున్నారు. ఇక ఇప్పటివరకు ఈ కర్ణాటక రత్న అవార్డును కేవలం 8 మందికి మాత్రమే ప్రధానం చేశారు.
2009వ సంవత్సరం తర్వాత కర్ణాటక రత్న అవార్డును ఎవరు అందుకోలేదనీ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెల్లడించారు. మరణాంతరం పునీత్ రాజ్ కుమార్ కు ఈ విధమైనటువంటి అవార్డు రావడంతో అభిమానులు ఒకవైపు విచారం వ్యక్తం చేస్తున్న మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.