చిరు కారణంగా భార్య చేతిలో దెబ్బలు తిన్న పూరి

చిరంజీవికి స్వాగతం చెప్పి పూరి జగన్నాధ్ సమస్యలలో ఇరుక్కున్నాడు. పూరి ట్వీటికి చిరంజీవి రిప్లై ఆయన్ని సమస్యలపాలు చేసింది. పూరి తన భార్య లావన్య చేతిలో దెబ్బలు తినాల్సివచ్చింది. ఈ విషయాన్ని పూరి తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని ప్రారంభించడం జరిగింది. దీనితో టాలీవుడ్ స్టార్ హీరోల నుండి సినీ ప్రముఖులు, హెరొఇన్స్ అందరూ ఆయన వెల్కమ్ చెప్పారు.

అందరితో పాటు పూరి కూడా సోషల్ మీడియాకు గ్రాండ్ వెల్కమ్ సర్ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి చిరంజీవి స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. అందరి ట్వీట్స్ కి సాధారణంగా స్పందించిన చిరు, పూరి ట్వీట్ కి మాత్రం అసాధారణ రిప్లై ఇచ్చారు. కరోనా కర్ఫ్యూ లో ఉన్న పూరి.. ముంబై, బ్యాంకాక్ బీచ్ లను బాగా మిస్సవుతున్నావు. ఐతే నీ పిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు బాగా సంతోషిస్తూ ఉండి ఉంటారు అన్నారు.

ఎప్పుడూ బీచ్ లు పట్టుకు తిరిగే పూరి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నాడు అనే అర్థం వచ్చేలా చిరంజీవి ట్వీట్ ఉంది. దీనితో ఆ ట్వీట్ చదివే తప్పుడు పక్కనే ఉన్న భార్య లావణ్య పూరి చెంప పగుల కొట్టిందట. చిరు ట్వీట్ వలన తన గత చర్యలు గుర్తు చేసుకొని భార్య కోప్పడి కొట్టింది అని పూరి కొంచెం ఆసక్తికరంగా స్పందించారు. పూరికి బీచ్ లంటే మహా ఇష్టం, తను బ్యాంకాక్ బీచెస్ లో కూర్చిన 15రోజుల్లో స్క్రిప్ట్ రాసుకొని ఇండియా వస్తాను అని అనేక సార్లు చెప్పాడు. పూరి సినిమాలలో కూడా బీచ్ సన్నివేశం సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus