Puri Jagannadh and Vijay: ‘లైగర్‌’ తర్వాత పూరి, రౌడీ ఆలోచన ఇదేనట!

‘లైగర్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది అని చెబుతూ… పూరి జగన్ ‘జన గణ మన’ అని అన్నారు గుర్తుందా? ఇదెందుకు అన్నారో ఆయన చెప్పకపోవచ్చు కానీ… ఆ మాటల వెనుక అర్థం ఆయన కలల ప్రాజెక్టు తెరకెక్కే రోజు దగ్గరికొచ్చిందని చెప్పడమే అంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకులు. ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండతో పూరి ‘జన గణ మన’ సినిమా పట్టాలెక్కిస్తారనేది గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు. అయితే ఇవి పుకార్లుగా మిగలకుండా నిజమైపోతాయి అంటున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ ఓపెనింగ్‌కి విజయ్‌ దేవరకొండ విచ్చేశాడు. మొన్నటివరకు జులపాల జుట్టుతో ‘లైగర్‌’ లుక్‌లో కనిపించిన విజయ్‌… ఆ ఈవెంట్‌ క్రాఫ్‌ దగ్గరకు వేయించి… మిలటరీ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇదంతా ‘జన గణ మన’ కోసమే అనేది లేటెస్ట్‌ టాక్‌. పూరి గతంలో ఓసారి మాట్లాడుత ‘జన గణ మన’ అనేది మన సైన్యం నేపథ్యంలో ఉంటుందని చెప్పినట్లు గుర్తు. దీంతో ‘జన గణ మన’ లుక్‌కి విజయ్‌ సిద్ధమైపోయాడు. ఇక పూర్తి ‘యాక్షన్‌’ అనడమే ఆలస్యం అంటున్నారు.

పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ కలసి ‘జన గణ మన’ నిర్మిస్తున్నారు అనేది టాక్‌. దీనికి ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత సమర్పకుడిగా ఉంటారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈ సినిమా పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమా స్క్రిప్ట్‌ దాదాపు పూర్తయిందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నారట పూరి. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌లో స్టార్ట్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం.

ఏప్రిల్‌ మొదటివారంలో తొలి షెడ్యూల్‌, మే నెలలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట పూరి టీమ్‌. మామూలుగా పూరి సినిమాలు చాలా వేగంగా పూర్తయిపోతుంటాయి. కానీ వివిధ కారణాల వల్ల ‘లైగర్‌’ బాగా ఆలస్యమైంది. అందుకేనేమో ‘జన గణ మన’ విషయంలో అలాంటి ఇబ్బంది రాకుండా… ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus