Pushpa 2 The Rule: ‘పుష్ప’ డైలాగ్స్‌ అన్నీ ఒకే వీడియోలో.. భలే ఉందిగా ఈ పాత ట్రెండు!

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule)  సినిమా ప్రచారం విషయంలో చిత్రబృందం చాలా కొత్త ఆలోచనలు చేసింది. అందులో చాలా వరకు బ్రాండ్‌ ప్రమోషన్‌ టైప్‌ ఆలోచనలే ఉన్నాయి. అంటే ‘పుష్ప’ అనే పేరు ప్రజలకు నిత్యం ఏదో రూపంలో కళ్ల ముందు కనిపించే ప్రయత్నమే. దీంతో సినిమా వచ్చాక ఆ తరహా ప్రచారం ఉండదేమో అనుకున్నారు కొందరు. కానీ చిత్రబృందం ఆ ఏర్పాట్లు కూడా భారీగానే చేసింది. దానికి ఉదాహరణ ‘నెట్‌ఫ్లిక్స్‌’ కోసం చేసిన వీడియో.

Pushpa 2 The Rule

సినిమా టీమే ఇంత చేస్తే.. ఆ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసిన సంస్థలు ఇంకెన్ని చేయాలి చెప్పండి. అందుకే వాళ్లు కూడా ఓ అడుగు ముందే ఆలోచిస్తున్నారు. కొందరైతే పాత ట్రెండ్‌లను ఇప్పుడు సరికొత్తగా ప్రయోగంలా చేసి చూపిస్తున్నారు. అందులో ఒకటి డైలాగ్స్‌ జ్యూక్‌ బాక్స్‌. ఇప్పటితరానికి జ్యూక్‌ బాక్స్‌ అంటే పాటలే. సినిమాలోని పాటలన్నీ కలిపి సినిమా రిలీజ్‌కు ముందే జ్యూక్‌ బాక్స్‌ అని ఆడియో హక్కులు పొందిన సంస్థలు విడుదల చేస్తుంటాయి.

గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ కోసం టీసిరీస్‌ టీమ్‌ డైలాగ్స్‌ జ్యూక్‌ బాక్స్‌ను రిలీజ్‌ చేసింది. సినిమాలోని ముఖ్యమైన డైలాగ్స్‌ను యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా అందులో ఆడియో రూపంలో పెట్టారు. ఆ వీడియో ఇలా వచ్చిందో లేదో అలా వైరల్‌ అయింది. 2000 సంవత్సరం కంటే ముందు ఇంకా చెప్పాలంటే క్యాసెట్స్‌ సమయంలో కేవలం డైలాగ్స్‌తోనే క్యాసెట్స్‌ వచ్చేవి. వాటిని వింటూ తెగ సంబరపడిపోయేవారు. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి.

‘పుష్ప: ది రూల్‌’ విషయంలో క్లిక్‌ అయితే ఇకపై మిగిలిన సినిమా టీమ్‌లు ఇలాంటి ఆలోచనను చేస్తాయి. ఇలాంటి మాస్‌ యాక్షన్‌ సినిమాల కంటే ప్రేమకథలకు ఈ ఆలోచన ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే రీల్స్‌లో, షార్ట్స్‌లో ప్రేమ డైలాగ్‌లు తెగ ట్రెండ్‌ అవుతున్న రోజులివి.

ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus