అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) రెండో వారంలోకి అడుగుపెట్టింది.ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది.పోటీగా సినిమాలు ఏమీ లేకపోవaడంతో ‘పుష్ప 2’ కి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. నార్త్ లో ‘పుష్ప 2’ భారీ లాభాలు రావడం గ్యారంటీ. అక్కడ ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వెనుకబడింది అని చెప్పాలి. అలా అని తీసిపారేసే విధంగా కాదు. స్టడీగానే ఉన్నాయి. లాంగ్ రన్ కి ఛాన్స్ ఉంది కాబట్టి, బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 76.62 cr |
సీడెడ్ | 29.51 cr |
ఉత్తరాంధ్ర | 19.98 cr |
ఈస్ట్ | 10.53 cr |
వెస్ట్ | 8.34 cr |
కృష్ణా | 10.23 cr |
గుంటూరు | 12.31 cr |
నెల్లూరు | 6.34 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 173.86 cr |
కర్ణాటక | 37.55 cr |
తమిళనాడు | 11.35 cr |
కేరళ | 9.89 cr |
ఓవర్సీస్ | 96.71 cr |
నార్త్ | 254.90 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 584.26 cr (షేర్) |
‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.584.26 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.20.74 కోట్ల షేర్ ను రాబట్టాలి.