‘తగ్గేదే లే..’ అంటూ టాలీవుడ్‌నే కాదు.. మొత్తం దేశాన్నే షేక్ చేశాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం వుడ్స్ అనే తేడా లేకుండా.. అన్ని వుడ్స్‌లో అదరగొట్టింది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో తన ప్రతాపం చూపించింది. ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ దక్షిణాది సినిమాల పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుక తెలుగు అవార్డ్స్ అంతా ‘పుష్ప’రాజ్ నామస్మరణతోనే నిండిపోయింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రాఫర్.. ఇలా అన్నింటా పుష్పరాజ్ అదరగొట్టాడు. అంతేకాదు మిగిలిన రంగాల్లోనూ అల్లు అర్జున్ సినిమా పేరు వినిపించింది.. అదే ‘అల వైకుంఠపురములో’. ఇక ప్రతిష్ఠాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా ‘పుష్ప’రాజ్ ఇంటికే వెళ్లింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌వెంట్ అవార్డు ఇచ్చారు.
2020 – 21 మధ్య విడుదలైన సినిమాలకు అవార్డులు ఇలా వచ్చాయి.
ఉత్తమ చిత్రం: పుష్ప – ది రైజ్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ సహాయనటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయనటి: టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (లైఫ్ ఆఫ్ రామ్.. : జాను)
ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (శ్రీవల్లి : పుష్ప – ది రైజ్)
ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ (ఊ అంటావా మావ.. పుష్ప – ది రైజ్ )
ఉత్తమ నటి (క్రిటిక్స్): సాయిపల్లవి (శ్యామ్ సింగ రాయ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : నాని (శ్యామ్ సింగ రాయ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (రాములో రాములా.. : అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రొజెక్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ నూతన నటి: కృతి శెట్టి (ఉప్పెన)