Pushpa, Akhanda: సైమా 2022.. అఖండ, పుష్ప సినిమాలదే హవా!

  • August 18, 2022 / 11:01 AM IST

గతేడాది విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలలో పుష్ప ది రైజ్, అఖండ ముందువరసలో ఉంటాయి. డిసెంబర్ నెలలో విడుదలైన ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించాయి. బుల్లితెరపై కూడా ఈ రెండు సినిమాలు మంచి రేటింగ్ లను సొంతం చేసుకోవడం గమనార్హం. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ నెల 10, 11 తేదీలలో జరగనుంది.

దక్షిణాది భాషలలో విడుదలైన సినిమాలలో నామినేషన్లలోకి వెళ్లిన సినిమాల వివరాలతో పాటు ఆ సినిమాలు ఎన్ని విభాగాలలో పోటీ పడనున్నాయో తాజాగా వెల్లడైంది. తెలుగులో గతేడాది విడుదలైన సినిమాలలో పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన సినిమాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ కావడం గమనార్హం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది. దక్షిణాది భాషల్లో మరే సినిమా ఇన్ని విభాగాలలో నామినేట్ కాలేదు.

పుష్ప ది రైజ్ తొలి స్థానంలో ఉండగా అఖండ సినిమా 10 విభాగాలకు నామినేట్ అయ్యి రెండో స్థానంలో ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా ఈ సినిమా ఎనిమిది విభాగాలకు నామినేట్ కావడం గమనార్హం. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా కూడా ఎనిమిది విభాగాలకు నామినేట్ అయింది.

నామినేట్ అయిన సినిమాలలో అన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలలో పుష్ప, అఖండ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిస్తే చిన్న సినిమాలలో ఉప్పెన, జాతిరత్నాలు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. కథల విషయంలో ఈ నాలుగు సినిమాలు వేటికవే భిన్నమనే సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ తో, సరికొత్త స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తున్నాయనే సంగతి తెలిసింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus