Pushpa Movie: వీకెండ్ తర్వాత ‘పుష్ప’ పరిస్థితి ఎలా మారబోతుందంటే..!

  • December 17, 2021 / 06:38 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈరోజు అంటే డిసెంబర్ 17న విడుదలైన చిత్రం ‘పుష్ప ది రైజ్’. మొదటి షో నుండే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా బాలేదు అని కొందరు బాగుంది అని మరికొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ‘హాఫ్ బేక్డ్’ మూవీ అనే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంది.

‘రంగస్థలం’ ని తలపించాలనో.. ‘కె.జి.ఎఫ్’ ని మరిపించాలనో చేసిన వృధా ప్రయత్నంలా ‘పుష్ప’ ఉందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ థీమ్ ను ‘రంగస్థలం’ నేటివిటీతో చెప్పినట్టు ‘పుష్ప’ ఉందట. సినిమాలో హైలెట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో.. మైనస్ పాయింట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి అనే కామెంట్స్ అయితే వాస్తవమే. సి.జి.వర్క్ అంతగా బాలేదు.దేవి శ్రీ ప్రసాద్ ‘మహర్షి’ చిత్రానికి ఇచ్చిన వరస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరే చిత్రానికి భవిష్యత్తులో ఇవ్వడేమో అని ఆ టైములో అంతా అనుకున్నారు.

దానిని మించి వరస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘పుష్ప’ కి అందించాడు అతను..! సుకుమార్ సినిమాకి అతని నుండీ ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించలేము. కొన్ని చోట్ల డబ్బింగ్ లోపాలు కూడా కనిపించాయి. సినిమాకి మెయిన్ హైలెట్ బన్నీ పెర్ఫార్మన్స్. అందులో ఏ డౌట్ లేదు. చివర్లో ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చాక మనకి బన్నీ కూడా తక్కువగా కనిపిస్తాడు. అయితే ఈ సినిమా సక్సెస్ భారం అంతా ఇప్పుడు అతని పైనే పడింది.

వీకెండ్ తర్వాత ఈ చిత్రం రాణించడం కష్టమే. నిర్మాతలు ప్రమోషన్లను కంటిన్యూ చేస్తే 1 వారం ఎక్కువ రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ‘పుష్ప’ ని గట్టెక్కించాల్సింది నిర్మాతలు ప్లస్ బన్నీ అనడంలో సందేహం లేదు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus