Pushpa Collections: 2021 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన పుష్ప..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు.. టీజర్, ట్రైలర్లు వంటివి సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. దీంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.

ఇక నిన్న విడుదల అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ముందు నుండీ నెలకొన్న హైప్ కారణంగా భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి :

నైజాం 10.20 cr
సీడెడ్  3.90 cr
ఉత్తరాంధ్ర  1.80 cr
ఈస్ట్  1.43 cr
వెస్ట్  1.50 cr
గుంటూరు  2.28 cr
కృష్ణా  1.15 cr
నెల్లూరు  1.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.36 cr
తమిళ్ నాడు   1.78 cr
కేరళ   1.18 cr
కర్ణాటక   3.59 cr
నార్త్ ఇండియా (హిందీ)   1.63 cr
రెస్ట్   0.97 cr
ఓవర్సీస్   4.21 cr
టోటల్ వరల్డ్ వైడ్  36.72 cr

‘పుష్ప ది రైజ్’ కి రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.36.72 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.109.28 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది. ఆంధ్రలో పలు చోట్ల టికెట్ రేట్లు పెరిగాయి కాబట్టి పుష్ప కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus