అల వైకుంఠంపురంలో మూవీ విజయం అల్లు అర్జున్ ఇమేజ్ ఓ మెట్టు పెంచింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. త్రివిక్రమ్ డైరెక్షన్ తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో మూడవ స్థానంలో నిలవడంతో పాటు బన్నీ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్ తో బన్నీ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప బడ్జెట్ కూడా భారీగా ఉండేలా తెలుస్తుంది. మొదట ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించలేదు.
ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల రోజు ఈ మూవీ టైటిల్ లోగో ఐదు బాషలలో విడుదల చేసి పాన్ ఇండియా అని హింట్ ఇచ్చేశారు. ఇక పాన్ ఇండియాకు తగ్గట్టే బడ్జెట్ పరిధి కూడా పెంచేస్తున్నారట. కేవలం సినిమాలో ఓ ఆరు నిమిషాల ఛేజింగ్ సన్నివేశం కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు కేటాయించారట. దట్టమైన అడవి ప్రాంతంలో జరిగే ఓ భారీ ఛేజ్ సీన్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ సంప్రదించారట. అలాగే ఈ యాక్షన్ ఛేజింగ్ సన్నివేశంలో భారీ ఎత్తున వాహనాలు ఉపయోగించనున్నారట.
ఇక సుకుమార్ కి కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన మరింత శ్రద్ధతో రంగస్థలంకి మించి బెటర్ అవుట్ ఫుట్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారట. బన్నీ పాన్ ఇండియా మార్కెట్ అంచనాలు వేయకుండా ఎడాపెడా డబ్బులు ఖర్చు పెట్టడం సేఫేనా అని కొందరి డౌట్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.