Pushpa Twitter Review: ‘పుష్ప’ ట్విట్టర్ టాక్ ఏంటి ఇలా ఉంది … తగ్గేదెలే..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా రూపొందిన చిత్రం ఈరోజు అనగా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే..! అల్లు అర్జున్.. పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ అవతార్ లో కనిపిస్తుంటే.. రష్మిక మందన.. శ్రీవల్లి గా డీ గ్లామరస్ పాత్రలో కనిపిస్తుంది. ఇక సునీల్, ధనుంజయ, అనసూయ వంటి వారు కూడా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత మరియు మలయాళం స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక పుష్ప కు తెలంగాణ లో స్పెషల్ షో లు పడనున్నాయి. ఓవర్సీస్ లో అయితే అల్రెడీ షో లు పడిపోవడం ఫస్ట్ టాక్ బయటకి రావడం జరిగింది. ట్విట్టర్ లో పుష్ప మూవీ పై తమ స్పందనని తెలియజేస్తున్నారు నెటిజన్లు. బన్నీ కెరీర్ లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని…అతని లుక్, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయని.. ఈ సినిమాలో అతను వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు.

ఇంటర్వల్ వద్ద వచ్చే ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుందని, బన్నీ – ఫహాద్ ఫాజిల్ మధ్యలో వచ్చే 20 నిమిషాల కాంబో సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అని వారు ట్విట్టర్లో పేర్కొంటున్నారు.సమంత ఐటం సాంగ్ కూడా సినిమాకి హైలెట్ అని చెబుతున్నారు. ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్ కూడా అదిరిపోయిందట.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus