Pushpa Movie: బన్నీ బాలీవుడ్ కోరిక నెరవేరుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 3వ వారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుండగా ఈ ఏడాది పుష్ప పార్ట్1 రిలీజ్ కానుంది. బన్నీ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.

అయితే బాలీవుడ్ లో ఈ సినిమాకు కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 83 సినిమాతో పోటీ తప్పదని తెలుస్తోంది. రణవీర్, దీపిక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ భారతీయ భాషల్లో రిలీజ్ కానుంది. మరోవైపు అద్వైత్ చందన్ డైరెక్షన్ లో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా

ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు రీజన్స్ వల్ల వచ్చే ఏడాది ప్రేమికుల రోజుకు ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న పుష్ప, 83 సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. బన్నీకి జోడీగా పుష్ప మూవీలో రష్మిక మందన్నా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus