Pushpa: ఫ్లోరిడా క్రికెట్ స్టేడియంలో సమంత స్పెషల్ సాంగ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై దాదాపు 8 నెలలు కావస్తున్న ఇంకా ఈ సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పాటలు డైలాగ్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మేనరిజం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ పాన్ ఇండియా స్థాయిలో అందరిని ఓ ఊపు ఊపింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించడమే కాకుండా ఏకంగా పెళ్లిళ్లలోనూ అలాగే ఫంక్షన్లలో కూడా తప్పనిసరిగా ఈ పాటకు చిందులు వేస్తూ ఉండేవారు.అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని నెలలు అయినప్పటికీ ఇంకా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

తాజాగా వెస్టిండీస్ తో భారత జట్టు తలపడుతున్న టీ20 మ్యాచ్ సందర్భంగా ఫ్లోరిడాలోని క్రికెట్ స్టేడియంలో ఏకంగా సమంత నటించిన ఊ అంటావా మావ స్పెషల్ సాంగ్ ప్లే చేశారు. ఈ పాటకు క్రికెటర్లు ఓ రేంజ్ లో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు అలాగే సమంత అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.

ఈ సినిమా విడుదల అయ్యి నెలలు గడిచిపోతున్న ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదని బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకోగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2సినిమా రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus