Pushpa: బన్నీ, నాని సినిమా రిలీజ్ డేట్లను గమనించారా?

కొన్నాళ్లుగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్న సంగతి తెలిసిందే. మేకర్స్ అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా వస్తుందన్న గ్యారెంటీ లేదు. వి.ఎఫ్.ఎక్స్ ప్రాబ్లమ్ అని, పోస్ట్ ప్రొడక్షన్ డిలే అని.. ఇలా ఏదో ఒక కారణంతో సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయడం లేదు మేకర్స్. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే .. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప 2 ‘ రూపొందుతుంది.

‘పుష్ప ‘ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నార్త్ మార్కెట్స్ లో ‘పుష్ప 2 ‘ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ డేట్ కి ‘పుష్ప 2 ‘ రాకపోవచ్చు అనే కామెంట్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. మేకర్స్ మాత్రం వాటిని తిప్పి కొడుతూనే అప్డేట్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 29న నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఇటీవల ఓ గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చారు.

గతంలో అంటే 2021 లో కూడా (Pushpa) బన్నీ, నాని..ల సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అయ్యాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ 2021 డిసెంబర్ 17 న రిలీజ్ అవ్వగా, నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ 2021 డిసెంబర్ 24న రిలీజ్ అయ్యింది. రెండు కూడా సక్సెస్ అందుకున్నాయి. ఈసారి కూడా అలాంటి సెంటిమెంటే రిపీట్ అవుతుందేమో చుడాలి

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus